Monday, May 6, 2024
- Advertisement -

భరత్ అను నేం టీంకి బాబు అండ్ కో నుంచి హెచ్చరికలు వెళ్ళాయా?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పేదేముంది? సమాజం కోసం ఏదో చేస్తున్నాం అన్న బిల్డప్పులు ఇస్తూ ఉంటారు కానీ అంతా కూడా చంద్రబాబునాయుడికి, టిడిపికి ఉపయోగపడేలానే వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రజలకు కూడా ఏమైనా ఉపయోగపడితే అదే పదివేలు. తాజాగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీపై చంద్రబాబు పట్టు మరోసారి తెలిసొచ్చింది. భరత్ అను నేను టీజర్‌లో ఇచ్చిన మాట, హామీ నిలుపుకోని వాడు మనిషే కాదు అన్న ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ మందికి చంద్రబాబే గుర్తొచ్చాడు.

2014 లో అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు భారీగా ఇచ్చాడు చంద్రబాబు. ఎన్నికలకు ముందే ఆ విషయంపై చంద్రబాబును నిలదీశాడు జగన్. కానీ పవన్‌తో సహా బాబు భజన బ్యాచ్ అంతా కూడా ఆ హామీలు చంద్రబాబు నెరవేరుస్తాడని ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మాత్రం అంతా కూడా జగన్ చెప్పినట్టే జరిగింది. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓటర్లు….బాబు మోసం దెబ్బకు హతాశులయ్యారు. అందుకే ఇచ్చిన హామీలు మరిచినవాడు మనిషే కాదు అన్న డైలాగ్ విన్న వెంటనే నెటిజనులు భారీగా చంద్రబాబును ట్యాగ్ చేస్తూ స్పందించారు. వెంటనే అలర్ట్ అయిన బాబు అండ్ టీం కొరటాల టీంకి హెచ్చరికలు పంపింది. ఇష్యూని మోడీపైకి డైవర్ట్ చెయ్యాలని వార్నింగ్ ఇచ్చారు. మహేష్ బాబు బావ, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ద్వారా ఈ మొత్తం డ్రామా నడిచింది. ఆ వెంటనే కొరటాల శివకు స్పందించక తప్పలేదు. ఆ రకంగా వివాదాలకు దూరంగా ఉండే కొరటాల శివను ఈ ఇష్యూలోకి లాగింది పచ్చ బ్యాచ్. ఇప్పుడు ఇదే విషయంపై ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలలో వెన్నుపోటు, మాట తప్పిన వాళ్ళను నిందించే డైలాగులు వినిపించకూడదా అంటూ పచ్చ బ్యాచ్‌పై జోకులు వేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -