Wednesday, June 12, 2024
- Advertisement -

పూజా హెగ్దేతో అఖిల్ రొమాన్స్‌

- Advertisement -

టాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా పూజా హెగ్దే మారుతుంది. వ‌రుస సినిమాల‌లో అవ‌కాశాలు కొట్టేస్తు టాప్ గేర్‌లో దూసుకుపొతుంది.ఎన్టీఆర్‌,మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ ఇలా టాలీవుడ్ టాప్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా చాన్స్‌లు కొట్టేస్తుంది.గతంలో బాలీవుడ్ లో నటించినప్పటికి ఆఫర్స్ అందుకొని పూజకు ఇప్పుడు మాత్రం కాల్షీట్స్ మరొకరికి ఇవ్వలేనంతగా బిజీ అయిపోయింది. ఇటీవల రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటెమ్ సాంగ్ లో కనిపించాక పూజ ఇమేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

అయితే రీసెంట్ గా మరో మంచి ప్రాజెక్ట్ లో డీజే బ్యూటీకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడవ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దేని సెలెక్ట్ చేశార‌ని తెలుస్తుంది.అయితే హీరోయిన్‌గా కాదు..ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని టాక్.అయితే ఇది ఐటెం సాంగ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -