Saturday, May 4, 2024
- Advertisement -

అన్నింటిని చిత్ర పరిశ్రమపై నెడితే ఎలా: రష్మి

- Advertisement -

సమాజం తప్పుదారిలో నడవడాన్ని ఏ సినిమా ప్రోత్సహించదని ప్రముఖ యాంకర్‌, నటి రష్మి అన్నారు. చిన్నారులు, మహిళలపై మృగాళ్ల అకృత్యాలను ఉద్దేశించి ఓ వ్యక్తి రష్మిని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న దారుణాలకు, మహిళలపై అకృత్యాలకు పనికిమాలిన సినిమాలే కారణమని మీకు తెలుసా?… చెత్త సినిమాల ప్రభావంతో చాలా మంది పిల్లలు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారని నేను భావిస్తున్నా’ అంటూ ఓ నెటిజన్ ప్రముఖ యాంకర్, నటి రష్మీని ప్రశ్నించాడు. ఆయన ట్వీట్‌కు స్పందించిన రష్మీ.. ‘ప్రతిదీ చిత్ర పరిశ్రమపై నెట్టేయకండి.

మైనర్‌ బాలికపై అత్యాచారం చేయడం సరైన పని అని ఏ సినిమాలోనూ చూపించరు. సినిమాలో చూపించిన ప్రతి దాన్ని నేర్చుకునేలా ఉంటే.. ఎందుకు మంచి సందేశాలను స్వీకరించడం లేదు. ఇవి ఆలోచనా రహిత వ్యాఖ్యలు’ అని సమాధానం ఇచ్చారు.అంతకు ముందు కథువా చిన్నారి సామూహిక అత్యాచారం, హత్య ఘటన తన హృదయాన్ని కలచివేసిందని రష్మి ట్వీట్‌ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -