Friday, May 3, 2024
- Advertisement -

అన్నదాతలను ఆదుకోండి

- Advertisement -

పార్లమెంట్‌లో తెలంగాణ ఏంపీలు గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పగపట్టిందని వారు పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అధికంగా వరి సాగు అవుతుందని అక్కడ రైతులు ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలంటే ఏ పంట వేసుకోవాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొననంటున్నదన్న కేంద్రం.. మరి తెలంగాణ రైతులు ఏ పంట వేసుకోవాలో చెప్పాలని ఎంపీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరోవైపు రైతులు ప్రత్యామ్నాయ పంట వేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అని ఆయన ప్రశ్నాంచారు. కేంద్ర ప్రభుత్వం ఓకే మాటమీద ఉండటం లేదని, నరేంద్ర మోడీ ధ్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధంగా, ఇతర రాష్ట్రాల్లో మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మరోవైపు రాజ్య సభకు సైతం తెలంగాణ వేడి తగిలింది. రాజ్యసభ్య సభ్యుడు కే. కేశవరావు రాజ్యసభ వేధికగా కేంద్రాన్ని కడిగిపారేశారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయటంలేదని, దీంతో తెలంగాణ రైతులు రొడ్డెక్కారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంచుకొస్తున్న జవాద్

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

గరీబొడి జేబుకు చిల్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -