నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాళ ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టగా ఆయన చివరి సినిమా సువర్ణ సుందరి.
నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కంకిపాడులో 1942 జులై 1న జన్మించారు కోట. 2003లో వచ్చిన సామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. 2018లో వచ్చిన ‘కాత్తాడి’ ఆయన చివరి తమిళ సినిమా. 1987లో బాలీవుడ్ చిత్రం ప్రతిఘాత్‌లో నటించారు. 2016లో విడుదలైన ‘భాగీ’ ఆయన చివరి హిందీ సినిమా.
నటుడిగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా పని చేశారు. 750కి పైగా సినిమాల్లో నటించిన కోటా… 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో ఆయనకు పద్మ శ్రీ అవార్డు వరించగా 1999లో బీజేపీ తరపున విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
