Saturday, April 20, 2024
- Advertisement -

శివాజీరాజాకు మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో దొంగలు పడ్డారు. విదేశాల్లో నిర్వహించిన ఈవెంట్లు ఫిక్సింగ్ అయిపోయాయి. ‘మా’ నిధులు కొందరి జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఒక్కో బిజినెస్ క్లాస్ విమాన టికెట్ కోసం 3 లక్షల రూపాయల చొప్పున దుబారా చేశారు. అవి ఎవరిని అడిగి, ఎవరి కోసం ఖర్చు పెట్టారు ? మా కార్యవర్గ సమావేశం మినిట్స్ బుక్ ఏమైంది ? కొన్ని రికార్డులు కనిపించడం లేదు ? సమావేశాల సిసి ఫుటేజ్ ఎందుకు డిలీటైంది ? ‘మా’ జనరల్ సెక్రటరీ హోదాలో నేను అడిగిన ప్రశ్నలకు ప్రెసిడెంట్ గా శివాజీరాజా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ శివాజీరాజా నా నంబర్ బ్లాక్ చేశాడు. తప్పించుకు తిరుగుతున్నాడు. అంటూ నటుడు సీనియర్ నరేశ్ దుమ్మెత్తి పోశాడు. తను చేసిన ఆరోపణలపై పలు ఆధారాలు కూడా చూపించారు.

దీనిపై శివాజీరాజా వర్గం సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఐదు పైసలు తిన్నానని నిరూపించినా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. నా పిల్లల మీద ఒట్టు. అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మాటలను ‘మా’ సభ్యులే కాదు. సినీ జనాన్ని ఎంతగానో ఆరాధించే, అభిమానించే ప్రేక్షకులు కూడా ఏమాత్రం నమ్మడం లేదు. పైగా ఎవరో మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు..అని శివాజీరాజా అనటం, మరిన్ని అనుమానాలుకు దారి తీస్తోంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ‘మా’ అధ్యక్షుడిగా నీకు లేకపోయినా, అవినీతిని వెలికితీసి, నిలదీసే బాధ్యత మీడియాకు ఉంది. ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలంటే నరేశ్ డిమాండ్ చేసినట్లు మాజీ ఐపీఎస్ అధికారితో నిజ నిర్ధారణ కమిటీ వేయించాలి. అందుకు ఎందుకు శివాజీరాజా ఒప్పుకోవడం లేదు. తాను అవినీతికి పాల్పడనప్పుడు, ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేయాలంటే భయమెందుకు ? పిల్లల మీద ప్రమాణం చేసి చెబితే ఆరోపణలు సమసిపోవు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తప్పు చేయకపోతే, నిధులు పక్కదారి పట్టకపోతే, వెంటనే ‘మా’ అధ్యక్ష పదవికి రాజనీమా చేసి, నిజనిర్ధారణ కమిటీకి అంగీకరించాలి. ఆ కమిటీ నిజానిజాలు తేల్చాకే, శివాజీరాజా కడిగిన ముత్యం అని తేల్చితేనే మళ్లీ అధ్యక్ష పదవిలో కొనసాగాలి అంతే కానీ, పిల్లలు, ప్రమాణాలు, ఆస్తులు రాసేస్తా….వంటి సినిమా డైలాగులు సినిమాల్లో చెబితేనే బాగుంటుంది. ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాంటివి చెబితే జనం ఉమ్మేస్తారు. పైగా శివాజీరాజా తమను పట్టించుకోవట్లేదని, పూటగడవడం కూడా కష్టంగా ఉందని, స్వయంగా ఆయన తల్లిదండ్రులే లబోదిబోమన్నారు. తర్వాత ఆ వ్యవహారం ఆయన కుటుంబ విషయమని చెప్పుకుని చక్కదిద్దుకున్నారనుకోండి. కానీ ఆయన మీద గతంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు నేపథ్యంలో తాజా ఆరోపణలను ఎక్కువమంది విశ్వసించే అవకాశమే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ‘మా అసోసియేషన్‌కి నిన్ను ప్రెసిడెంట్‌గా చూడాలని ఉంది బ్రో’ అని. మంచు మనోజ్ కు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ చాలా ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘‘నేను వెళితే తప్పకుండా అందరికీ ఫసక్కే. బ్రో.. ‘మా’ చాలా నిజాయితీగా వ్యవహరిస్తోంది. తమపై విమర్శలు చేస్తున్న వారిని తప్పు అని నిరూపించడం కోసమైనా వారు తమ సంఘాన్ని రివిజన్ చేస్తారు. ( అంటే పునర్విమర్శ చేస్తారు ) వాళ్లేమీ చికెన్స్ కాదు.. చికెన్స్‌లా దూరంగా పారిపోవడానికి. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవడానికి వీలుగా ‘మా’ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నేను నమ్ముతున్నా. మీపై నిందలు వేసిన వారివి తప్పని ‘మా’ నిరూపించు’’ అని మనోజ్ రీట్వీట్ చేశాడు. మనోజ్ చేసిన ట్వీట్ కు అనేకమంది నుంచి సానుకూల స్పందన వస్తోంది. నిజమే బ్రో నువ్వు చెప్పినట్టు, ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలి. ఎవరైనా వచ్చి చెక్ చేసుకునేటట్టు పారదర్శకంగా ఉండాలి. అంతే కానీ పిల్లలు, ప్రమాణాలు, ఆస్తులు అంటూ తప్పించుకు తిరగడమేంటి ? వెంటనే నరేశ్ ఆరోపణలపై కచ్చితంగా ఆధారాలు సహా సమాధానం చెప్పాలి. అని నెటిజన్లు, సినీప్రియులు డిమాండ్ చేస్తున్నారు. మరి ‘మా’ సభ్యులు దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి సమాధనం చెబుతారో… లేక ‘మా’లోనే దొంగలున్నారని తేలితే ‘మా’ పరువు పోతుందని చడీచప్పుడు లేకుండా ఉండిపోతారో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -