Thursday, April 25, 2024
- Advertisement -

మ‌హ‌ర్షి రివ్యూ..

- Advertisement -

మహేష్ కెరియర్‌లో 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంటోంది. మహేష్ కెరీర్‌లో మైల్‌ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే న‌టించింది.అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సూపర్‌స్టార్‌ అందుకున్నాడా..? మహేష్‌ కెరీర్‌లో మహర్షి మెమరబుల్‌ సినిమాగా మిగిలిపోయిందా?

క‌థ విష‌యానికి వ‌స్తె…
క‌థ ప్యారీస్‌లో ప్రారంభం అవుతుంది. రిషి కుమార్ (మ‌హేష్ బాబు) ఆరిజిన్‌ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. ప్లా ష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రి స్నేహితుల (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. మ‌రి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? విజ‌యం అంటే డ‌బ్బు సాధించ‌డ‌మే, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే రిషి – అస‌లుసిస‌లైన విజ‌యాన్ని ఎలా గుర్తించాడు? మ‌హ‌ర్షిగా ఎలా మారాడు? అనేదే క‌థ‌.

వైజాగ్ ఐఐఈటీలో జాయిన్‌ అయిన రిషికి, రవి (అల్లరి నరేష్‌), పూజ (పూజా హెగ్డే)లు పరిచయం అవుతారు. ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్‌ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావటంతో ముగ్గురూ విడిపోతారు. ప్రపంచాన్ని గెలవలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మరణంతో ఇండియా తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.

రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి, వివేక్‌ మిట్టల్‌(జగపతి బాబు)ను కలిసి గ్యాస్‌ పైప్‌ లైన్ పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్‌ అంగీకరించక పోవటంతో రిషి.. రామవరంలో తన కంపెనీ బ్రాంచ్‌ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో రిషి, మిట్ట‌ల్ మ‌ధ్య పోరు మొద‌ల‌వుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజ‌యం సాధించార‌నేదే క‌థ‌.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తె..

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో రిషి పాత్రలో జీవించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. మరో కీలక పాత్రలోనటించిన అల్లరి నరేష్‌ కూడా తనదైన నటనతో మెప్పించాడు. కెరీర్‌ బెస్ట్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

హీరోయిన్‌ పూజా హెగ్డే తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లుక్‌ పరంగా మంచి మార్కులు సాధించారు. విలన్‌ జగపతిబాబు మరోసారి స్టైలిష్‌ లుక్‌లో మెప్పించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్‌, జయసుధ, సాయి కుమార్‌, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -