- Advertisement -

సింగిల్ స్క్రీన్ లో సందడి చేయనున్న మహేష్ బాబు

- Advertisement -

ఇంతకు ముందు చాలా సందర్భాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తనకి అచ్చి వచ్చిన సుదర్శన్ థియేటర్ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఈ థియేటర్ ని సందర్శించనున్నారు. ఈ థియేటర్ లో ఆడిన ఆయన సినిమాలు దాదాపుగా చాలా విజయం సాధించినవే. తాజాగా మహర్షి కూడా అందులోనే ప్రదర్శింపబడుతూ ఘానా విజయాన్ని సాధించింది.

మహేష్ బాబు అన్ని సినిమాలకి పీఆర్ గా ఉండే బీఏ రాజు ఇదే విషయాన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. “మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సాయంత్రం 6.30 కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ని సందర్శించనున్నారు.” అని ఆయన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే భారీ సంఖ్యలో థియేటర్ కి చేరుకొని తమ అభిమాన అహీరో తో మహర్షి విజయం పంచుకోవాలనే ఆశ తో వేచి చూస్తున్నారు. అంతే కాకుండా థియేటర్ మేనేజ్మెంట్ కూడా మహేష్ బాబు రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మహేష్ ఈ థియేటర్ కి రావడం అంటే కచ్చితంగా గొప్ప విశేషం అనే చెప్పుకోవాలి.

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వచ్చిన మహర్షి సినిమా ని దిల్ రాజు, అశ్విని దత్ మరియు పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -