Sunday, May 12, 2024
- Advertisement -

శౌర్య రివ్యూ

- Advertisement -

కరంటు తీగ లాంటి సినిమాతో హిట్టు కొట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా ఆ సినిమా ఆడలేదు మనోజ్ కి. మరొక పక్క గ్రీకు వీరుడు తరవాత హిట్ లేని దశరథ్ మనోజ్ తో కలిసి శౌర్య అనే ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఎంచుకుని హిట్ కొట్టడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు.

ట్రైలర్ తో పాటు ప్రమోషన్ లు కూడా అంతగా ఆకట్టుకోకపోయినా ఈ సినిమా కి ఓపెనింగ్ లు పరవాలేదు అనిపించాయి. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమా తీసారో చూద్దాం రండి. 

కథ – కథనం – నెగెటివ్ లు 

శౌర్య(మంచు మనోజ్ – నేత్ర(రెజీన కసాండ్ర) ప్రేమించుకుంటారు. కానే ఎప్పటిలానే పెద్దల నుంచి సమస్య రావడంతో పారిపోవాలని డిసైడ్ అయ్యి దేశం వదిలి వెళ్లి పోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఎలాగో దేశం వదిలి వెళ్ళిపోతున్నాంకదా అని చివరి రోజు శివరాత్రి కావడం వలన శివాలయంలో జాగారం చేయడానికి వస్తారు. కట్ చేస్తే నేత్రని చంపాలని అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో దాదాపు ప్రాణాలు కోల్పోయే స్టేజ్ కి వెళ్ళిన నేత్రని హాస్పిటల్ లో చేర్చి, శౌర్యని ముద్దాయిగా జైల్లో వేస్తారు. ఆ కేసు డీల్ చేయడానికి కృష్ణ ప్రసాద్(ప్రకాష్ రాజ్) రంగంలోకి దిగితాడు. అక్కడే శౌర్య ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి? అక్కడి నుంచి కథ ఎలా మలుపులు తిరిగింది? ప్రేమించిన శౌర్యనే నేత్రని చంపాలనుకున్నాడా? లేక ఇంకెవరన్నా చంపాలనుకున్నారా? ఫైనల్ గా నేత్ర బతికిందా లేదా అన్నదే మిగిలిన థ్రిల్ చేసే కథ. పెర్ఫార్మెన్స్ విషయం లో మనోజ్ అదర గొట్టేసాడు . సినిమాని ఒంటి చేత్తో లాక్కెళ్ళి కాస్త హై లైట్ అనిపించుకున్న పాత్ర మనోజ్ ది . ఎమోషనల్ సీన్స్ లో చాలా ఎదిగాడు అనిపించింది. రెండు షేడ్స్ ని మైంటైన్ చెయ్యడం లో మనోజ్ డైరెక్టర్ దశరథ్ కి పెర్ఫెక్ట్ సెలెక్షన్ గా మారాడు. ప్రకశ్ రాజ్ పాత్ర కూడా సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పచ్చు. కథ ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్. ఆసక్తికర ట్విస్ట్ లతో కథని రాసుకున్నాడు దశరథ్.

సినిమా కథ నీ స్క్రిప్ట్ నీ పర్ఫెక్ట్ గా రాసుకున్న దశరథ్. సినిమాని తెరకి ఎక్కించడం లో చాలా తడబడ్డాడు. ముఖ్యంగా మొదటి భాగం సినిమా పేలవంగా సాగుతుంది. దాన్ని కవర్ చెయ్యడం కోసం అన్నట్టు సెకండ్ హాఫ్ ని మరింత రంజుగా తీయడం కోసం కంగారు పడ్డాడు డైరెక్టర్. పాటలు సినిమాకి పెద్ద మైనస్. స్పీడ్ బ్రేకర్ లు లాగా చాలా చోట్ల అడ్డం పడ్డాయి అని చెప్పాలి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫిలు పరవాలేదు. సినిమాకు కీలకమైన ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.సినిమా చాలా వరకూ బాగా బోరింగ్ గా ఉంది. 

మొత్తం గా :

శౌర్య సినిమా ని క్లైమాక్స్ కోసం , మధ్యలో ఒచ్చే ట్విస్ట్ ల కోసం ఖచ్చితంగా ఒక్క సారి చూసేయచ్చు. ముప్పై నిమిషాల పాటు థ్రిల్ సీన్ ని బాగా డీల్ సెహ్సాడు డైరెక్టర్. ఎంటర్టైన్మెంట్ మరింత జోడించి – స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటె మనోజ్ కెరీర్ లో టాప్ సినిమా కచ్చితంగా అయ్యేది. స్లో గా ఉన్నా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు చూడదగిన సినిమా అని చెప్పచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -