Monday, May 6, 2024
- Advertisement -

అభిమానికి కౌంట‌ర్ ఇచ్చిన మెహరీన్‌

- Advertisement -

కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ దారుణానికి పాల్పడిన దుర్మార్గులని శిక్షించాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రముఖులు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మెహరీన్‌ ట్వీట్‌ చేశారు. ‘నేను హిందుస్థానీని.. సిగ్గుపడుతున్నా.. ఎనిమిదేళ్ల బాలిక.. సామూహిక అత్యాచారం, హత్య ,ఓ ఆలయంలో అంటూ ‘న్యాయం జరగాలి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ మేరకు ప్లకార్డుతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.దీనిపై ఓ వ్య‌క్తి స‌మాధానం ఇచ్చాడు.ఈ ఘ‌ట‌న‌ను చాలా తెలిగ్గా తీసిపారేశాడు.హిందుస్థానీగా ఉండటం మీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లిపో అని ,హిందుస్థానీయులుగా ఉన్నందుకు మేం చాలా గర్విస్తున్నాం.

ఇలాంటి చిన్న చిన్న విష‌యాలు అభివృద్ది చెందిన దేశాల‌లో కూడా జ‌రుగుతున్నాయ‌ని మీరు దీనిపై స్పందించి చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా మారుస్తున్నార‌ని …మెహరీన్ ట్వీట్‌కు స‌మాధానం ఇచ్చాడు.ఇత‌ని ట్వీట్‌కు ప్ర‌తి స్పంద‌న‌గా మెహరీన్ మ‌రో ట్వీట్ చేసింది.నీలాంటోళ్ల గురించే నేను పోస్ట్‌ చేసింది అంటూ మెహరీన్ బదులిచ్చింది. మెహరీన్ ఇచ్చిన కౌంట‌ర్‌కు అత‌ను మ‌ళ్లీ రిప్లై ఇవ్వ‌లేదు.భలే కౌంటర్‌ ఇచ్చావ్‌ మెహరీన్‌ అంటూ పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -