అక్కినేనే నట వారసుడు అఖిల్ తాజాగా నటించిన చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కాని అఖిల్ ఆశలను ఆడిఆశలు చేసింది ఈ సినిమా. ఇప్పటికే అఖిల్ నటించిన రెండు సినిమాలు ఫెయిల్ కాగా ,ఈ సినిమా ఫలితం కూడా నిరాశకు గురి చేసింది. సినిమా ఏమాత్రం బాలేదని ప్రేక్షకులు తెల్చేశారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద కనిపిస్తుంది.
సినిమా విడుదలై 5 రోజులు కావస్తున్న 12 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా అఖిల్ మొదటి సినిమా కలెక్ట్ చేసినంత కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ‘అఖిల్’ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా రూ. 64 లక్షలకు పైగా రాగా, ఆ తరువాత వచ్చిన ‘హలో’కు దాదాపు రూ. 1.50 కోట్లు వచ్చాయి. ఇక, ‘మిస్టర్ మజ్నూ’ కలెక్షన్లు రూ. 57.62 లక్షలు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మిస్టర్ మజ్ను అఖిల్ కెరీర్‌లోనే ఈ అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో అఖిల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌లను తన ఖతాలో వేసుకున్నాడు.
- జీవీ ప్రకాశ్‌ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి..
- టీడీపీ ఎంపీపై ఈడీకి ఫిర్యాదు
- తల్లికి వందనం..ఈ మూడు పనులు తప్పనిసరి!
- వెన్నుపోటుకు రెండేళ్లు..వైసీపీ నిరసన గళం
- రజినీకాంత్ ‘జైలర్ 2’ లో హృతిక్ రోషన్
