Wednesday, May 15, 2024
- Advertisement -

సుప్రీంకోర్టు చెప్పినా విన‌లే

- Advertisement -

నాలుగైదు రాష్ట్రాల్లో విడుద‌ల కానీ ప‌ద్మావ‌త్

వివాదాల, గొడవలు, నిరసనలు, ఆందోళనలు, దాడులు, అరాచకాల ఒక సినిమాకు ఎన్ని జ‌ర‌గ‌కూడ‌దో అన్నీ పద్మావత్ సినిమాకు జ‌రిగాయి. ఈ సినిమా కోసం జ‌రిగిన ర‌చ్చ‌ర‌చ్చ అంతాఇంతా కాదు. ఎట్ట‌కేల‌కు సుప్రీంకోర్టు . జోక్యం చేసుకోవ‌డంతో సినిమా థియేట‌ర్ల‌లో జ‌న‌వ‌రి 25వ తేదీన విడుద‌ల‌య్యింది. ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో చివ‌రికి విడుద‌ల‌నే కాలేదు. సుప్రీంకోర్టు చెప్పినా నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అస్స‌లు విడుద‌ల కాలేదు.

సినిమా విడుదలను అడ్డుకుంటూ రాజ్‌పుత్‌లు హెచ్చ‌రిస్తూ థియేటర్లపై దాడులు చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. స్కూల్ బస్సులపై దాడులు చేశారు. షాపులు పగలగొట్టారు. రైళ్లను అడ్డుకున్నారు. మొత్తంగా ఒక విధ్వంస‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ర్ణిసేన సృష్టించింది. అయితే ఈ సినిమా చివ‌రికి మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో విడుద‌ల కాలేదు. థియేటర్లు పద్మావత్ సినిమాను ప్రదర్శించడానికి భ‌య‌ప‌డ్డాయి. షో వేయటానికి వెనకాడారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క షో కూడా పడలేదు. రాజస్థాన్‌లో ఆందోళనలు మరీ ఎక్కువగా ఉన్నాయి. రాజ్‌పుత్‌లు అధికంగా ఉండే రాజస్థాన్‌లో మాత్రం అస్స‌లే విడుదల కాలేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -