Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఙాతవాసి ట్రైలర్ రివ్యూ……. మినీ యుద్ధంతో గెలిచేసిన పవర్ స్టార్

- Advertisement -

అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో బిజినెస్ జరగిన సినిమా…..తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే హార్డ్ కోర్ అభిమానులు ఎక్కువగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ట్రైలర్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊరించి ఊరించి మరీ ట్రైలర్ రిలీజ్ చేశాడని కొందరంటున్నారు. కాదు…….టీ సిరీస్‌తో పదికొట్లకు బేరం తెగాక ట్రైలర్ రిలీజ్ చేశారని మరికొందరు చెప్తున్నారు.

ఆ విషయాలు పక్కనపెడితే ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చెయ్యలేదు. మిగతా విషయాలన్నీ పక్కనపెట్టినా మినీ యుద్ధం డైలాగ్ మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. జీవితంలో మనం అనుభవించే ప్రతి సుఖం వెనకాల ఓ మినీ యుద్ధం ఉంటుందని పవన్ చెప్పిన డైలాగ్‌కి ఫిదా అవడం గ్యారెంటీ. ట్రైలర్‌లో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే ఆ డైలాగ్ స్థాయిలో ఇతర కంటెంట్ ఏదీ ఉండకపోవడం. త్రివిక్రమ్ సినిమాలన్నింటిలోనూ అలాంటి ఒక భారీ డైలాగ్ ఉంటుంది. కానీ ఇతర కంటెంట్ మాత్రం ఆ డైలాగ్‌కి కనీసం దగ్గరగా కూడా ఉండదు. ఈ ట్రైలర్‌లో కూడా సేం టు సేం. ఆ డైలాగ్ విషయం పక్కనపెడితే మిగతా అంతా కూడా కామెడీ సినిమాలా ఉంటుంది. సినిమాలో కామెడీ కోసం త్రివిక్రమ్ పడ్డ తాపత్రయం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడే పవన్ కళ్యాణ్ స్థాయి టాప్ రేంజ్ స్టార్ సినిమానా? చిన్నస్థాయి కామెడీ సినిమానా అనేలా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గ్లామరస్‌గా కనిపించడంతో పవన్ ఫ్యాన్స్‌ మాత్రం మెచ్చే అవకాశాలున్నాయి. కాస్త కాన్సెప్ట్ ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఆ మినీ యుద్ధం డైలాగ్ మినహాయిస్తే ట్రైలర్‌లో ఇంకేం ఉంది? అని ఉసూరనడం కూడా ఖాయం. ట్రైలర్‌తో మరీ భారీ స్థాయిలో మెప్పించారని చెప్పలేం…….అలాగే డిసప్పాయింట్ చేశారని కూడా చెప్పలేం. కాకపోతే ఇండస్ట్రీ హిట్ కొట్టే స్థాయిలో అయితే ఈ ట్రైలర్ లేదు. మరీ రెగ్యులర్‌గానే ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు ఇతర టెక్నికల్ అంశాలు కూడా ది బెస్ట్ అనే స్థాయిలో లేవు.

లాస్ట్ పంచ్ః సినిమాలను రాజకీయాలను వేర్వేరుగా చూడడం పవన్ నేర్చుకుంటే బెటర్. సర్దార్‌లో కూడా బోలెడన్ని పొలిటికల్ డైలాగులు వినిపించిన పవన్……..ఇక అజ్ఙాతవాసి ట్రైలర్‌లో మళ్ళీ సైకిల్ ఎక్కి మనల్ని ఓడిస్తాడా అనే సెన్స్‌లో ఓ డైలాగ్ వినిపించాడు. ఇది మాత్రం అత్యంత ఛీప్ టేస్ట్ అని చెప్పొచ్చు. సినిమాలో సందర్భం ఉండొచ్చు కదా అని సమర్థించుకోవచ్చు కానీ ట్రైలర్‌లో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం లేదు అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -