Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఙాతవాసి సెన్సార్ రిపోర్ట్…. కథ, హైలైట్స్, డ్రాబ్యాక్స్ ఏంటంటే?

- Advertisement -

కొడకా కోటేశ్వరరావా సాంగ్‌తో అజ్ఙాతవాసి హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళాడు పవన్. సాహిత్యం, సంగీతం పరంగా మరీ గొప్ప పాట ఏమీ కాదు కానీ పవన్ కళ్యాణ్ వాయిస్ మాత్రం మేజిక్ చేసేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అజ్ఙాతవాసి సినిమాకు సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ పవన్, త్రివిక్రమ్‌లకు షాక్ ఇస్తాయా? హ్యాపీనెస్ ఇష్తాయా? సినిమాను ఎలా డిసైడ్ చేయాలో ఇది చదివి మీరే చెప్పండి.

ఈ సినిమా కథ వెరీ సింపుల్. ఆవిడా మా ఆవిడే సినిమాలో తన వైఫ్ టబు యాక్సిడెంట్‌లో చనిపోయిందనుకుని మరోపెళ్ళి చేసుకుంటాడు నాగార్జున. అలాగే అజ్ఙాతవాసి సినిమాలో పవన్ ఫాదర్ కూడా ఒక యాక్సిడెంట్‌లో తన భార్య చనిపోయిందనుకుని మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆ సంఘటన జరిగిన సమయానికి ఆమె గర్భంతో ఉంటుంది. ఆమె కొడుకే పవన్ కళ్యాణ్. ఆమె సంరక్షణలోనే స్ట్రీట్ కుర్రాడిగా పెరుగుతాడు. తన తండ్రి చనిపోయాక ఆయన వేల కోట్ల కంపెనీలకు ఒక డమ్మీ వారసుడిగా ఆ కంపెనీలలో చేరేలా ఖుష్బూ చేస్తుంది. అక్కడ పవన్ చేసే కామెడీ…….ఆ తర్వాత అసలు వారసుడు పవనే అని తెలుసుకునే షాకింగ్ క్లైమాక్స్‌లు సినిమాలో ప్రధాన ఆకర్షణలు. కీర్తి సురేష్ రోల్ కాస్త తక్కువే. బట్ తన పెర్ఫార్మెన్స్‌కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక గ్లామర్ కోషెంట్ మొత్తం అను ఇమ్మాన్యుయేల్‌దే. అలాగే త్రివిక్రమ్ గత సినిమాలను మించిన స్థాయిలో ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ స్కిన్ షో ఉంటుందని తెలుస్తోంది. కామెడీ సీన్స్‌లో పవన్ కళ్యాణ్ మేజిక్ మరోసారి సూపర్బ్‌గా పనిచేసింది.

ఇక ఎమోషనల్ సీన్స్‌లో కూడా పవన్ మెప్పించాడని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కలం నుంచి మాత్రం మరీ అద్భుతాలు ఆశించడానికి లేదన్నది సెన్సార్ రిపోర్ట్. డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గత సినిమాలతో పోల్చుకుంటే ఎబౌ యావరేజ్ అనే స్థాయిలోనే ఉన్నాయని చెప్తున్నారు. సాంగ్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ చేసిన అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం మెప్పించాడట. మొత్తంగా అజ్ఙాతవాసి భవిష్యత్తు మొత్తం కూడా త్రివిక్రమ్ కంటే కూడా పవన్‌పైనే ఎక్కువ ఆధారపడి ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ వర్క్ ఎబౌ యావరేజ్ అనే స్థాయిలోనే ఉందట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా కోసం బాగానే కష్టపడ్డాడట. ఆ కష్టం ఫలించి స్క్రీన్‌పై పవన్ మేజిక్‌కి ప్రేక్షకులు ఫిదా అయితే మాత్రం అత్తారింటికి దారేది స్థాయి రిజల్ట్ ఖాయమని చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -