బుల్లితెరపై సందడి చేయన్నున్న పవన్ కళ్యాణ్ కూతురు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో పవన్ అభిమానుల్లోసందడి వాతావరణం నెలకొంది. తాజాగా మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ టెలివిజన్ జీ తెలుగులో ఛానల్ ప్రసరమవుతున్న డ్రామా జూనియర్స్ లో రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో ఒకటి రిలీజ్ చేయగా లిటిల్ ప్రిన్సెస్ ఆద్య కనిపించడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.అక్కడ తన పాపను చూసి ఎమోషనల్ అయిపోయారు రేణు దేశాయ్.తన కూతురును చూసి నువ్వు నా జీవితంలో దొరికిన అతిపెద్ద వరం అంటూ ముద్దు పెట్టుకున్నారు. అలాగే ఆద్య కూడా ప్రపంచంలో నువ్వే బెస్ట్ మమ్మీ అంటూ కామెంట్ చేసింది. రేణు దేశాయ్ జడ్జిగా ఉన్న ‘డ్రామా జూనియర్స్’ షో నెక్స్ట్ ఎపిసోడ్ కు పవన్ కూతురు ఆద్య అతిథిగా రానున్నట్లు సమాచారం.

- Advertisement -

Also read:హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

పవన్ కళ్యాణ్ కూతురు అశోకు వస్తున్నారని తెలియగానే పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు.మదర్స్ డే సందర్భంగా మే 9 రాత్రి ఎనిమిది గంటలకు ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక రేణుదేశాయ్ విషయానికొస్తే పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ తీసుకుని పూణే వెళ్లిపోయారు. అక్కడే ఉండి తన లైఫ్ గడుపుతున్నారు. ఈ మధ్యే మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తున్నారు.మొదటిసారిగా బుల్లితెర కార్యక్రమంలో సందడి చేయనున్న.. పవన్ కూతురు?

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -