తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. ఈ మధ్య ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో యూత్ ను అలరించిన ఆమె, ప్రస్తుతం ‘ సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా చేస్తోంది. మహేశ్ బాబు 25వ సినిమాలో కథానాయికగా కూడా ఆమె పేరే వినిపిస్తోంది.
అజ్ణాతవాసి సినిమా డిజాస్టార్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యింది. ఈ సినిమా యూనిట్ త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడిచేయనున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని సంస్థ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మార్చి రెండవ వారంలో ఆరంభించనున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపిస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్టుగా ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కి .. సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి అవకాశం దక్కకపోవడం విశేషం. సినిమాపై క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది.
