‘ప్రాజెక్ట్ కే’ కోసం 200 డేస్ కేటాయించిన రెబల్ స్టార్..!

ప్రభాస్​ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్​ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2019 ఆగస్ట్​ 30న ప్రభాస్​ నటించిన సాహో విడుదలైంది. ఇక అప్పటినుంచి ప్రభాస్​ సినిమా ఏదీ రాలేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన రాధేశ్యామ్ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్​ చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ.. ఈ ఏడాదిలో రాధేశ్యామ్ విడులదయ్యే చాన్స్​ ఉంది.

ఇదిలా ఉంటే ప్రభాస్​.. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో సలార్​ అనే చిత్రంలో, ఓం రౌత్​ దర్శకత్వంలో ఆదిపురుష్​లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు టాలీవుడ్ డైరెక్టర్ నాగ్​అశ్విన్​తోనూ ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాగ్​అశ్విన్​ సినిమా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. సైన్స్​ ఫిక్షన్​ చిత్రం గా వస్తున్న ఈమూవీలో బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ ఓ కీలకపాత్ర చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామోజీ ఫిల్మ్​సిటీలో ఈ మూవీ షూటింగ్​ నడుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్​ 200 రోజుల డేట్స్​ ఇచ్చాడని టాక్​. ప్రస్తుతం ప్రభాస్​ లేని పార్ట్​ అంతా షూటింగ్​ జరుపుతున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వనీదత్​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక రాధేశ్యామ్ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో థియేటర్లు ఓపెన్​ కాబోతున్నాయి. చిన్న సినిమాలు విడుదలయిన అనంతరం ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ? చూసి పెద్ద చిత్రాలు విడుదల చేసే చాన్స్​ ఉంది.

Also Read

రెండో పెళ్ళికి సిద్ధమైన సుమంత్.. వధువు ఎవరంటే..!

చరణ్​- శంకర్​ సినిమాలో హీరోయిన్​గా లక్కీబ్యూటీ..!

థియేటర్లపై ఎందుకీ ఆంక్షలు.. నానీ సంచలన వ్యాఖ్యలు

Related Articles

Most Populer

Recent Posts