చరణ్​- శంకర్​ సినిమాలో హీరోయిన్​గా లక్కీబ్యూటీ..!

- Advertisement -

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నకు వరుసగా విజయాలు దక్కడంతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. లక్కీబ్యూటీగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నది రష్మిక. ఈ అమ్మడు ఏ సినిమాలో నటించినా సూపర్​ హిట్​ అవతోంది. దీంతో దర్శక నిర్మాతలంతా రష్మిక వెంట పడుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం తెలుగులో రష్మిక ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న పాన్​ ఇండియా మూవీ పుష్పలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చరణ్​- శంకర్​ కాంబినేషన్​లో రాబోతున్న భారీ బడ్జెట్​ సినిమాలోనూ రష్మిక చాన్స్​ కొట్టేసిందని టాక్​. ఈ సినిమా కోసం మొదట బాలీవుడ్​ హీరోయిన్​ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ అవకాశం రష్మికకు దక్కిందట. భారీ బడ్జెట్ సినిమా కావడంతో రష్మిక కూడా ఒప్పుకుందని టాక్​.

ఇక రామ్​ చరణ్​ ఆర్​ఆర్​ఆర్​, ఆచార్య షూటింగ్​ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్​ పూర్తయిన వెంటనే.. కొత్త ప్రాజెక్ట్​ ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్లో శంకర్-చరణ్ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read

బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!

‘సలార్​’ కథలో భారీ మార్పులు..!

త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -