Thursday, April 25, 2024
- Advertisement -

థియేటర్లపై ఎందుకీ ఆంక్షలు.. నానీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

కరోనా ఎఫెక్ట్​తో ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. లాక్​డౌన్​ నిబంధనలు సడలించినప్పటికీ థియేటర్లు మాత్రం ఓపెన్​ కావడం లేదు. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టోపోయాయి. దీంతో ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. థియేటర్లు ఓపెన్​ చేసేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. అయితే తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాక.. థియేటర్లలో పార్కింగ్​ ఫీజు వసూలు చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పించింది.

అయితే థియేటర్ల యజమానులు మాత్రం.. విద్యుత్​ బకాయిలు మాఫీ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్​ చేసుకొనేందుకు అనుమతి ఇచ్చారు. జీవో నంబర్​ 35 విడుదల చేసి.. టికెట్ల ధరల విషయంలో ఆంక్షలు విధించారు. దీంతో థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సీ సెంటర్ థియేటర్లు నడపడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏపీ, తెలంగాణలోని థియేటర్లు ఓపెన్​ కాబోతున్నాయి. జూలై 30 నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి.

ఇదిలా ఉంటే టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్న సినిమా తిమ్మరుసు థియేటర్​లో విడుదల కాబోతున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్​ ఫంక్షన్​కు ఎన్టీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాచురల్ స్టార్​ నానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’ మనదేశంలో ప్రజలకు ఎంటర్​టైన్మెంట్​ సినిమాలే. అటువంటి సినిమాలపై ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే ఎవరూ పట్టించుకోరు. కానీ టికెట్ ధరలను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి.’ అంటూ ఆయన ఫైర్​ అయ్యారు.

Also Read

నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?

మా ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయా?

‘సలార్​’ కథలో భారీ మార్పులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -