- Advertisement -

సరికొత్త విధానంలో ఇంకో ‘బాహుబలి’!

- Advertisement -

ఇప్పటికే ప్రపంచ ప్రేక్షకులను అలరించి ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ఓ కొత్త టెక్నాలిజీతో మన ముందుకు రాబోతోంది. ప్రపంచ సినిమా కనుక్కున్న సరికొత్త శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)తో ఈ సినిమా జతగట్టబోతోంది రాబోతోంది.

‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ‘బాహుబలి: ది కంక్లూజన్‌’తోపాటు…అదే సమయంలో వీఆర్‌ వెర్షన్‌ ‘బాహుబలి’ని కూడా సిద్ధం చేస్తున్నారు. కేన్స్‌ చలనచిత్రోత్సవంలో ఓ బాలీవుడ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు రాజమౌళి.

రాజమౌళి మాట్లాడుతూ… ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ పనులు శరవేగంగా జరగుతున్నాయి. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సరికొత్త విధానంలో ఇంకో ‘బాహుబలి’ని అందించబోతున్నాం. వర్చువల్‌ రియాలిటీ ద్వారా ‘బాహుబలి’ని ప్రేక్షకులకు కొత్తగా చూపించబోతున్నాం అని చెప్పారు.

{youtube}v=Kx_yJDF6A1Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -