సల్లూ భాయ్ కి థ్యాంక్స్ చెప్పిన శృంగారతార తల్లి!

- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఎన్నో వివాదాలు ఉన్నాయి. కృష్ణ జింక కేసు ఆయన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఇప్పటికే బ్యాచ్ లర్ జీవితాన్ని అనుభవిస్తున్న ఆయనకు ఎంతో మంది ప్రియురాళ్లు ఉన్నారని బాలీవుడ్ టాక్. పెళ్లి విషయం ఎప్పుడు తెచ్చిన వచ్చే ఏడాది అంటూ కామెంట్స్ చేయడం సల్లూ భాయ్ కి అలవాటు. ఆయనపై ఎన్ని వివాదాలు ఉన్నా.. మరోపక్క ఆయన ఒక మానవతా మూర్తి అంటారు. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వార ఎంతో మందికి సేవ చేస్తున్నారు.

ఎంద‌రికో ఎన్నో సార్లు సాయ‌ప‌డ్డ స‌ల్లూభాయ్ ఇటీవ‌ల  క్యాన్సర్ చికిత్స పొందుతున్న నటి రాఖీ సావంత్ తల్లి జయ క్యాన్సర్ చికిత్స కోసం ఆర్ధిక సాయం అందించారు. తాజాగా త‌న తల్లి మాట్లాడిన వీడియోని రాఖీ సావంత్ త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ  స‌ల్మాన్ ఖాన్, బిగ్ బాస్ 14ల‌ను  ట్యాగ్ చేసింది. ఇటీవ‌ల రాఖీ సావంత్ త‌న త‌ల్లి ఆసుప‌త్రి ఖ‌ర్చుల కోసం స‌ల్మాన్ అత‌ని సోద‌రుడు సోహైల్ వైద్య ఖ‌ర్చుల‌కు సాయం చేస్తున్నార‌ని పేర్కొన్న సంగతి తెలిసిందే. 

- Advertisement -

సల్మాన్ ఖాన్ నిజంగా మాకోసం పంపిన దేవ దూత అన్నారు. ఆ ఇద్దరు సోదరుల సహాయం జీవితాంతం మరువలేనని ఆమె ధన్యవాదాలు తెలిపారు. స‌ల్మాన్ సార్ లాంటి సోద‌రుడు మాకు దొర‌క‌డం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్ పేర్కొంది.  రాఖీ ఇటీవ‌ల బిగ్ బాస్ 14 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా,  ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో ఆమె రూ. 14 లక్షల మొత్తంతో ప్రదర్శన నుండి బయటకు వచ్చింది.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -