మెగాస్టార్ చిరంజీవి ఖైది 150 సినిమా తరువాత నటిస్తున్న చిత్రం సైరా.ఊయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ ఈ సినిమాను తన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలై చాలాకాలం అయినప్పటికి సినిమా షూటిగ్ పార్ట్ ఇంకా 60 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడం, రీషూట్లు చేయడం వంటి కారణంగా ఇప్పటికే సినిమా బడ్జెట్ చేయి దాటిపోయిందని తెలుస్తోంది. దీంతో సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందని సమాచారం.
ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పినప్పటికి ఆయన ఎటువంటి మార్పు రాలేదట. దీంతో సురేందర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట రామ్ చరణ్. ఇకపై తీసే సన్నివేశాలను బడ్జెట్ లోనే తీయాలని డైరెక్టర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి పర్ఫెక్షన్ కోసం తీసిన సీన్లే తీస్తున్నాడట. మరి సురేందర్ రెడ్డి భయం ఆయనకు ఉంటుంది కదా. ఒకవేళ సినిమా బాలేదంటే రామ్ చరణ్‌ని కాని , చిరంజీవిని ఎవరు ప్రశ్నించారు. అప్పుడు అందరి వెళ్లు సురేందర్ రెడ్డి వైపే చూపిస్తాయి. ఈ విషయంలో సురేందర్ రెడ్డి చాలా జాగ్రత్తగానే ఉంటేనే మంచిదని చాలామంది సలహా ఇస్తున్నారట.
- పరకాల ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో సంచలన ట్విస్ట్!
- కన్నతల్లి కామ పిశాచిగా మారి.. ఐదేళ్ల పాపను..
- రుతుపవనాలు ఎంట్రీ..కానీ సీన్ రివర్స్!
- సామాన్యుడికి మరో షాక్..గ్యాస్ ధర మళ్లీ పెంపు
- న్యూజిలాండ్‌ను వరణుడు కాపాడేనా?
