తమ సమస్యలను చెప్పుకొనేందుకు కొందరు పాదయాత్ర చేస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు పాదయాత్ర చేస్తారు. మరికొందరు భక్తులు తమ ఇష్ట దైవం కోసం పుణ్యక్షేత్రాలకు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తుంటారు .. గతంలో మనం ఇటువంటివి ఎన్నో చూశాం. కానీ ప్రస్తుతం కొందరు తమకు ఇష్టమైన నటుడిని కలుసుకొనందుకు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు.
ఇప్పటికే సోనూ సూద్ కోసం తెలంగాణకు చెందిన ఓ యువకుడు ముంబై వరకు పాదయాత్ర చేశాడు. అల్లు అర్జున్, సినీ నటి రష్మిక కోసం కొందరు ఫ్యాన్స్ ఎంతో మంది ప్రయాణించారు.ఇదిలా ఉంటే జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన యువకులు తమ అభిమాన నటుడు రామ్చరణ్ను కలుసుకొనేందుకు సుమారు 200 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆయనను కలుసుకున్నారు. రామ్ చరణ్ కూడా సదరు యువకులను కలుసుకొని.. వారితో కొంతసేపు మాట్లాడి పంపించారు.
నరేష్,సంధ్య, జయరాజ్, రవి, వీరేష్ రాంచరణ్ అభిమానులు. చరణ్ ను కలుసుకొనేందుకు 200 కిలోమీటర్లు ప్రయాణించారు. వీరిని ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.అయితే నటులను కలుసుకొనేందుకు ఇలా వందల కిలోమీటర్లు ప్రయాణించడం అవసరమా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
Also Read
