బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా వెలుగుచూసింది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో భాగంగా ఎంతోమంది బాలీవుడ్ తారల పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ డ్రగ్ మాఫియా కేసులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాను గతంలో అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. రియాను అరెస్టు చేసిన సమయంలో
చార్జ్‌షీట్‌లో ఆమె చెప్పిన వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
గతంలో దివంగత నటుడు సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉండేది అని చెప్పిన రియా తాజాగా ఈ వ్యవహారంలో మరొక నటి భాగమైనట్లు తెలిపారు. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతాసింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్. ఈమె నటుడు సుశాంత్ తో కలిసి కేదార్నాథ్ అనే సినిమాలో నటించడం వల్ల తనకు పరిచయం ఏర్పడినట్లు ఈక్రమంలోనే తనకి గంజాయి, వోడ్కా సారా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో పేర్కొంది.
Also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?
గతేడాది సుశాంత్ మరణం తరువాత డ్రగ్ మాఫియా కేసులో భాగంగా ఎన్సీబీ నటి సారా అలీ ఖాన్ ను ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో కొంత కాలం పాటు సుశాంత్ తో తను లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు, తనతో కలసి డేటింగ్ చేసినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా సుశాంత్ తో కలిసి థాయిల్యాండ్‌కు ట్రిప్ వెళ్లినట్టు సారా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రియా చక్రవర్తి చార్జిషీట్లో సారా అలీ ఖాన్ తో కలిసి గంజాయిని తీసుకున్నట్లు తెలపడంతో ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also read:స్పీడ్ మీదున్న తారక్.. ఉప్పెన దర్శకుడితో సంప్రదింపులు?
