అలీతో సరదాగా లో రవి శంకర్.. షాకింగ్ నిజాలు..!

- Advertisement -

ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాధించుకున్నాడు ప్రముఖ నటుడు సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్. ఎన్నో సినిమాలకు ఆయన తన గొంతును ఇచ్చారు. ‘అరుంధతి’ సినిమాలో ‘బొమ్మాలీ నిన్ను వదలా..’ అంటూ ఆడియన్స్ గుండెలు అదిరిపోయేలా డబ్బింగ్ చెప్పి తనకు తానే సాటి అనిపించుకున్నారు.

అలీ హోస్ట్ చేస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు రవి శంకర్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. అలీ ప్రశ్నలకు అదిరిపోయే జవాబులు ఇచ్చాడు రవి శంకర్. ‘అరుంధతి’కి ముందు ‘అరుంధతి’కి తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అని ఆలీ అడిగిన ప్రశ్నకు రవి శంకర్ జవాబు ఇస్తూ.. ” నేను సాయి కుమార్ తమ్ముడిని కాబట్టి నన్ను అంతా సాయి రవి కుమార్ అని పిలిచేవారు. కానీ ‘అరుంధతి’ తర్వాత అందరూ నన్ను ‘బొమ్మాళీ’ రవి శంకర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఓసారి నేను నా భార్యతో కలిసి సినిమా చూడటానికి వెళ్లాను.

- Advertisement -

సినిమా అయిపోయాక ఆడియన్స్‌తో పాటే మేము బయటికి వెళుతుంటే కొందరు లేడీస్ మా దగ్గరికి వచ్చి ‘ఇలాంటివాడితో ఎలా సంసారం చేస్తున్నావమ్మా’ అని నా భార్యతో అన్నారు. దాంతో నేను షాకైపోయాను. మా ఇంట్లో నా అన్నయ్య దేవుడులాంటి మనిషి. అన్నయ్య కంటే గొప్ప ఎవరు అంటే కచ్చితంగా మా వదినే అని చెప్తాను. నా వదినకి హ్యాట్సాఫ్’’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బాత్రూమ్ లో గంటసేపు ఫోన్ మాట్లాడి బయటకు వచ్చే అలవాటు ఉందని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫ్రోమోను మీరు కూడా చూసేయండి..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News