యశోద తొలి గ్లింప్స్ ఎప్పుడంటే ?

స్టార్ హీరోయిన్ సమంత వరుస మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. సామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీస్‌లో ఒకటి యశోద. హరి, హరీష్‌లు దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ యశోదను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ బయటకొచ్చింది. యశోద చిత్రం నుంచి తొలి గ్లింప్స్‌ను ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటించారు మేకర్స్. మే 5, 2022న ఉదయం 11:07 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. యశోద మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్ తదితరులు లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన సమంత లేటెస్ట్ చిత్రం ‘కణ్మణి రాంబో ఖతీజా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక త్వరలో తెరకెక్కబోతున్న యశోదతోనై సమంత హిట్ కొడుతుందేమో చూడాలి.

మరో మెగా హీరోతో కొరటాల మూవీ

కుమార్తెకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన చిరు

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

Related Articles

Most Populer

Recent Posts