Thursday, April 18, 2024
- Advertisement -

కరోనా కాటుకు ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు కన్నుమూత

- Advertisement -

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ లో ఎంతో మంది సినీ ప్రముఖులు మృతి చెందారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి మరో స్టార్ సింగర్ ను కూడా బలి తీసుకుంది. ఒడియాకు చెందిన ప్రముఖ గాయకుడు అమరేంద్ర మహంతి కరోనా కారణంగా మృతి చెందారు.

కొన్ని రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డి ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మహంతి క‌న్నుమూశారు. ఒడియాతో పాటు పలు భాషల సినిమాలకు సంగీతాన్ని అందించడంతో పాటు ఎన్నో పాటలను పాడిన అమరేంద్ర మహంతి గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాటుడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన కరోనా కాటుకు బలి అయ్యారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, కేంద్రమంత్రి ప్రతాప్‌ చంద్ర షడంగి, ఓలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మూడు దశాబ్దాల పాటు ఒరియా సినీ పరిశ్రమలో మహంతి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

సీఎం కేసీఆర్ పై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు!

గంగులా ఖబర్ధార్.. నీ కథ మొత్తం తెలుసు : ఈటెల రాజేందర్

హీరో రామ్ ఇంట విషాదం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -