Saturday, May 11, 2024
- Advertisement -

స్పీడున్నోడు మూవీ రివ్వూ

- Advertisement -

అల్లరి చిల్లరిగా తిరిగే శోభన్ ( హీరో శ్రీనివాస్) స్నేహం కోసం ప్రాణం ఇచ్చే రకం. ఐదుగురి కలిసి ఒక బృందం గా ఉంటూ చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అందులో ఒక ముగ్గురు ఒకే సమయం లో వాసంతి (హీరోయిన్ సోనరిక) ని ప్రేమిస్తారు. ఆమె చుట్టూనే కథ ఫస్ట్ హాఫ్ అంతా తిరుగుతుంది.

ఆమెని ఎలా లైన్ లో పెట్టారు చివరకి హీరో ఎలా ఆమెని గెలుచుకున్నాడు అనేదాని మీద నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో అసలైన కథ మొదలు అయ్యి అనంతపురానికి చేరుకుంటుంది. శోభన్ అక్కడ ప్రకాష్ రాజ్ కొడుకు కావడం అదే ఊర్లో అతని శత్రువు రావు రమేష్ కూతురు వాసంతి కావడం తో ఇంటరెస్టింగ్ పాయింట్ మొదలు అవుతుంది.

ఒక పక్క ఫ్రెండ్ షిప్ నీ మరొక పక్క లవ్ నీ మధ్యలో తండ్రి శత్రుత్వం శోభన్ ఎలా డీల్ చేసాడు అనేది ఈ సినిమా కథ. స్టార్ కాస్ట్ చాలా బాగుంది అని చెప్పాలి. లీడ్ పైర్ తో పాటు ప్రకాష్ రాజ్, పోసాని, కబీర్ సింగ్ , ఆలీ , పృధ్వీ రాజ్ , శ్రీనివాస రెడ్డి మ జాన్సీ ఇలా కావలసినంత మంది ఉన్నారు. మధ్యలో ఐటెం సాంగ్ లో తమన్నా మెరవడం మరొక విశేషం.

బెల్లం కొండ శ్రీనివాస్ కూడా తన నటనలో మంచి ఎదుగుదల చూపించాడు . సోనరికా తన అందాలతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం మీద పాటలు ఆకట్టుకున్నాయి. ఫ్రెండ్ షాప్ మీద వచ్చే సీన్ లు బాగున్నాయి. క్లిమక్స్ కి సినిమా చేరుకునే తీరు బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫమిలే సీన్ లు బాగున్నాయి. బెల్లం కొండ శ్రీను డాన్స్ లు బాగా చేసాడు . తమన్నా ఆదరగోట్టేసింది తన పాటలో .

 నెగటివ్ లు : 

బెల్లం కొండ శ్రీను ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ తో నటించడం నేర్చుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక్క సారిగా ఆగకుండా ఒచ్చే పాటలు విసిగిస్తాయి. కామెడీ ప్లాట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా బోరింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ మధ్యన సరైన ఫౌండేషన్ లేదు అనిపించింది .వారు అంత గట్టి ఫ్రెండ్స్ అవ్వడానికి సరైన కారణం చూపించలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బేలో యావరేజ్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ భీమనేని తన అనుభవం సరిగ్గా సెంటిమెంట్ సీన్లలో వాడారు కానీ మిగితా సీన్ లలో సరిగ్గా వాడలేదు గా ఉంది. 

 మొత్తంగా ::

మొత్తం మీద స్పీడున్నోడు సినిమా సెంటిమెంట్ కోసం, స్నేహం మీద మరీ మోజు ఉన్న వారు ఒక్కసారి చూడదగ్గ సినిమా అని చెప్పాలి. తమన్నా అందాలూ, సోనారికా గ్లామర్, హీరో డాన్స్ లూ అదిరిపోయాయి. కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్వించిన జనాలని థియేటర్ కి లాక్కోచ్చెంతగా ఏమీ లేదు.  ఆఫ్ సీజన్ కావడం సరైన సినిమాలు పోటీకి లేకపోవడం తో ఏమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త కాసులు కురిపించచ్చు కానీ అంతకు మించి చూడదగ్గ సినిమా అయితే కాదు. మాస్ లో బెల్లం కొండ శ్రీనివాస్ కి ఫాలోయింగ్ మాత్రం నెమ్మదిగా బిల్డ్ అవ్వడానికి ఈ సినిమా ఉపయోగ పడుతుంది ఖచ్చితంగా. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -