Monday, May 6, 2024
- Advertisement -

‘స్పైడర్’ మూవీ రివ్యూ

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ సినిమా స్పైడర్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించినగా.. ఎస్ జే సూర్య, భరత్ లు నెగిటివ్ పాత్రలో కనిపించారు. హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్నాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మరి ఈ ‘స్పైడర్’ ఎలా వుందో.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ శివ(మహేష్ బాబు). శివ చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తనకు వచ్చిన కాల్ ద్వారా అసాంఘిక కార్యక్రమాలను, సమస్యలను తెలుసుకొని వాటిని పరిశ్కరిస్తుంటాడు. ఇలా శివ లైఫ్ నడుస్తుండగా.. అతని లైఫ్ లోకి ఓ అమ్మాయి(రకుల్ ప్రీత్‌సింగ్) వస్తోంది. అయితే శివకి రకుల్ ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు ఇంటి సభ్యులు. కానీ ఎలాంటి పరిచయాలు లేకుండా బ్లైండ్ డేట్‌ ద్వారా ప్రేమించి పెళ్లిచేసుకోవాలని అనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివ.. రకుల్ కాల్ ట్రేస్ చేసి.. ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇలా జరుగుతుండగా.. తన సంతోషం కోసం.. జనాలను హత్య చేసే వ్యక్తి భైరవుడు (ఎస్.జె.సూర్య). భైరవుడు చేసిన విధ్వాంసాలేంటి? దానివల్ల జరిగిన నష్టమేంటి? శివకు ఆ వ్యక్తికి మధ్య ఏం జరిగింది? మరి ఈ సమస్యను శివ ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

స్పైడర్ మూవీ మరోసారి మహేష్ బాబు తన నటనతో అదరగొట్టాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా మహేష్ సూపర్ యాక్టింగ్ చేశాడు. ఒక సమస్యను పరిష్కరించే ఆఫీసర్ గా.. మహేష్ అద్భుతంగా చేశాడు. తన పాత్ర మేరకు మహేష్ ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా.. అందంగా.. నటించాడు. ఫైట్స్ విషయంలో కూడా సూపర్ అనిపించాడు. ఇక నెగిటివ్ పాత్రలో ఎస్‌జె సూర్య బాగా చేసాడు. ఇందులో మహేష్‌కు సూర్య గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మహేష్ రోల్ పవర్ఫుల్ పాజిటివ్ తరహాలో ఉంటే.. సూర్య పాత్ర కూడా అదే తరహాలో నెగెటివ్ తరహాలో ఉంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. మహేష్, రకుల్ మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఇక భైరవుడు పాత్రలో ఎస్. జె. సూర్య చాలా బా నటించాడు. ఎదుటివారి ఏడుపులో ఆనందం కోరుకునే వ్యక్తిగా బాగా చేసాడు. ఇక భరత్, ప్రియదర్శిలు వారి వారి పాత్రలలో బాగా చేసారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సినిమా విషంకు వస్తే.. స్పైడర్ మూవీ.. ఇంటెన్సిటితో కూడుకున్న థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్. ఫస్ట్‌హాఫ్‌ చాలా సరదా సరదాగా కొనసాగుతూనే సినిమా మూడ్‌ను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తుంది. ఇక సెకండాఫ్ స్టోరీ పరంగా ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్లింగ్ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. మొత్తానికి ఈ సినిమా మహేష్‌‌కు ఒక కొత్త అనుభూతి అని చెప్పుకోవచ్చు. ఇక సంతోష్ శివన్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకి ప్లస్ పాయింట్. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దాడు. హారీస్ జయరాజ్ సంగీతం ప్లస్ అయ్యింది. పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేసింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇక డైరెక్టర్ మురుగదాస్ మరోసారి ‘స్పైడర్’తో మరో హిట్ చిత్రాన్ని తీసాడు. మురుగదాస్ కథ ఇంట్రెస్టింగ్‌గా వుండటంతో పాటు పక్కా స్క్రీన్‌ప్లే‌తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను కథలో లీనం చేసే విధంగా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లేను అద్భుతంగా డిజైన్ చేసారు. ఓవరాల్‌గా మురుగదాస్ దర్శకుడిగా మరోసారి తన సత్తా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. తమిళ్ నేటివిటీ కొంత కనిపించినట్లు ఉంటుంది. సాంగ్స్ విషయంలో ఇంకాస్తా జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది.

మొత్తంగా :

స్పైడర్ మూవీ.. భారీ అంచనాలతో వచ్చి.. ఆ అంచనాలను అందుకుంది. పక్క కథ, కథనంతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు మేజర్ ప్లస్ పాయింట్. స్పైడర్ మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా స్పైడర్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -