- Advertisement -

ఆస‌క్తిని క‌లిగిస్తున్న సాయిప‌ల్ల‌వి వ్యాఖ్య‌లు..

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది వచ్చిన సూపర్ సక్సెస్ సినిమాల లిస్టులో ఈ మూవీ నిలిచిపోయింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన హీరోయిన్ సాయిపల్లవి.

ఈసినిమాలో సాయిప‌ల్ల‌వి భానుమ‌తి పాత్ర పోషించిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికి తెలిసిందే. తెలంగాణా యాస భాష‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకుంది హీరోయిన్‌. క‌లెక్స‌న్ల‌ను రాబ‌ట్ట‌డంలో ముందుంది.అయితే సాయిప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించ‌కున్నాయి.

సినిమాల్లో ఆందాల ఆర‌బోత అన్న‌ది ఇప్పుడు అల‌వాటైపోయింది. మేము వాటికి దూరంగా ఉంటామ‌ని చెప్పినా చివ‌రికి క‌థ డిమాండ్ చేయ‌డంతో త‌ప్ప‌లేద‌నె మాట‌లు వినిపిస్తుంటాయి. ఆందాల ఆర‌బోత‌గురించి సాయిప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి గ్లామర్ కోసం ఎక్స్ పోజింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని, కిస్సింగ్ సీన్స్ కూ తాను వ్యతిరేకమని స్పష్టం చేసింది. సినిమాల్లో నటించాలనే తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు గౌరవించారు కనుక, వాళ్లని ఇబ్బందిపెట్టే పనేదీ తాను చేయదల్చుకోలేదని సాయిపల్లవి చెప్పడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -