- Advertisement -

విజయ్ -సాయి పల్లవి జంటగా మణిరత్నం సినిమా

- Advertisement -

దక్షిణ భారత సినీ ప్రేక్షకులకు శుభవార్త. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతి హీరోగా నటించనుండగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

విజయ్ సేతుపతి తన వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందగా, సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ ఇద్దరూ కలిసి నటించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

మణిరత్నం సినిమాలు ఎప్పుడూ కథ, భావోద్వేగాలు, సంగీతంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆయన దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం కూడా మరో క్లాసిక్‌గా నిలుస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేయడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. సినిమా కథ, ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -