- Advertisement -

శ్రీరెడ్డిపై తెలుగు దేశం ఎంపీ ఘాటు వాఖ్య‌లు

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌ల‌న తార శ్రీరెడ్డిపై ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ మాజీ అధ్యక్షుడు, తెలుగు దేశం ఎంపీ మురళీ మోహన్ ఫైర్ అయ్యారు.క‌ళామ్మా త‌ల్లిగా భావించే ఫిలిం చాంబ‌ర్ ద‌గ్గ‌ర శ్రీరెడ్డి చేసిన అర్థ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. శ్రీరెడ్డి హిందూ ధర్మాన్ని మరిచి ఇలా చేయడం కరెక్ట్ కాదని.. ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. సినిమాల‌లో యాక్ట్ చేసే ప్ర‌తి ఒక్క‌రికి మా లో స‌భ్య‌త్వం ఇవ్వడం సాధ్యం కాదని ఆయనన్నారు. జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉండటంతో అందరూ ‘మా’ వైపు చూస్తున్నారని.. ఇలా అందరికీ ఎలా సభ్యత్వం ఇస్తామని ఆయన ప్రశ్నించారు. శ్రీరెడ్డి ఎవ‌రో కూడా త‌నకు తెలియ‌ద‌ని అంత‌కముందు ఆమె ఏ సినిమాలు చేసిందో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని ఆయన అన్నారు.

ఒక‌వేళ త‌న‌కు ఏదైనా స‌మ‌స్య ఉంటే పోలీసులు ఉన్నార‌ని అక్క‌డ‌కి వెళ్లి త‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెత‌కాల‌ని ఎంపీ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.ఒకవేళ సభ్యత్వం నిరాకరించినా ఇలా నడి రోడ్డులో బట్టలు విప్పడం దారుణమని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అంతటితో ఆపకుండా మీడియాను పిలవడం.. డిబేట్లు పెట్టడం తనకు మనస్తాపం కలిగించిందని ఆయనన్నారు.ఇలా నిరసన తెలపడం వల్ల శ్రీరెడ్డికి ఏం ఒరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం పానకంలో పుడక లాంటిదని, దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయ అభిప్రాయడపడ్డారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -