Saturday, April 20, 2024
- Advertisement -

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

- Advertisement -

రమ్య కృష్ణన్ : హీరోయిన్‌గా విభిన్న పాత్రలు పోషించిన వారిలో రమ్యకృష్ణ పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ‘కంటే కూతుర్నే కను’, ‘ఆవిడే శ్యామల’, ‘నరసింహ’ లాంటి సినిమాలు రమ్యకృష్ణలోని నట ప్రతిభకు మచ్చుతునకలు. దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. బాహుబలితో ఆమె బ్రాండ్ సౌత్ లో గట్టిగా పెరిగింది. రమ్య 3 లక్షల వరకు డైలీ పేమెంట్ తీసుకుంటారట.

నధియ : అందమైన అత్త, అమ్మ క్యారెక్టర్లకు నదియా కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు లభించకపోయినా, అమ్మ, అత్త క్యారెక్టర్లకు మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఏ పాత్ర చేసినా గ్లామర్‌ ఒలకబోయడంలో నదియా తరువాతే అంటారు సినీ జనాలు. అత్తారింటికి దారేది – మిర్చి – దృశ్యం వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె 2 నుంచి 3 లక్షల వరకు డైలీ పేమెంట్ తీసుకుంటారట.

జయసుధ : సావిత్రి తరువాత సహజనటి అన్న బిరుదును సొంతం చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌, ఇప్పటి అమ్మ జయసుధ. మధ్య మధ్యలో రాజకీయాలంటూ అటు వైపు వెడుతున్నా అమ్మ, నాయనమ్మ పాత్రలకు బెస్ట్‌ ఛాయిస్‌గా నిలిచింది జయసుధ. పది నుంచి పన్నెండురోజుల షూటింగ్‌ ఉంటే రోజుకు 2 లక్షలు… ఆ పైన ఒక్కో రోజు లక్ష అదనంగా చెల్లించాల్సిందేనట!

రేవతి : వెండతెర మీదున్న టాలెంటెడ్‌ నటీమణులలో రేవతి పేరు చెప్పుకుని తీరవలసిందే! హీరోయిన్‌గా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి హీరోయిన్‌ అని పేరు తెచ్చుకుంది. మిగతా అమ్మల మాదిరిగా రోజుకి ఇంత అని కాకుండా సినిమాకి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటుంది.. 2 నుంచి 5 లక్షలు డైలీ పేమెంట్…

పవిత్ర లోకేష్‌ : వయస్సు రీత్యా చిన్నదే అయినా ఇటీవలి కాలంలో పవిత్ర లోకేష్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది. సాఫ్ట్‌గా నవ్వు ముఖంతో పెద్దరికంగా కనిపించే పవిత్ర డేట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు. అమ్మ పాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోతుందో రెమ్యునరేషన్‌ విషయంలో కూడా అంతే పట్టు విడుపుతో వ్యవహరిస్తుంది అంటారు సినీ జనాలు. రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటుంది.

తులసి : సంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన తులసి ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘శంకరాభరణం’లో నటించింది. ఆ సినిమాతో తులసి పేరు మారుమ్రోగిపోయింది. పెళ్లి చేసుకున్న తరువాత చాలా సంవత్సరాలకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది తులసి. అమ్మ, అక్క పాత్రలు చేస్తోంది. ఈమే రోజుకి 35 వేల నుంచి 40 వేలు డైలీ పేమెంట్.

రాశి : ఛైల్డ్‌ ఆర్టిస్టు నుంచి హీరోయిన్‌గా ఎదిగింది రాశి. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్ళి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైంది. ఆ తరువాత బరువు విపరీతంగా పెరిగి పోవడంతో చిన్న వయస్సులోనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. అక్కా, అమ్మ, వదిన ఇలా తనకు తగిన క్యారెక్టర్‌ చేస్తోంది. ప్రస్తుతం రాశి రోజుకు 75వేల రూపాయల చొప్పున తీసుకుంటుంది.

రోహిణి : తెలుగులో రోహిణి హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే అని చెప్పుకోవాలి. నటిగా కన్నా కూడా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రోహిణి బాగా పాపులర్‌ అయింది. చాలా మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువు ఇచ్చే రోహిణి అమ్మ, అక్కా, ఆంటీ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోహిణి ఒక్కో సినిమాకి రోజుకి 50 నుంచి 60 వేల చొప్పున తీసుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -