రాంచరణ్ భార్య ఉపాసన జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటిచేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో తెలియాలి.పార్టీ కోసం కుటుంబం నుండి బయటికి వచ్చిన పవన్ కల్యాణ్ మరి ఉపాసనకి టిక్కెట్ ఇస్తారనేది డౌటే మరి. ఒకవేళ ఇచ్చన ఆమెకు సరిపోయ్యే నియోజకవర్గం కూడా ఉండాలి.ఇన్నాళ్లు పవన్‌కు దూరంగా ఉన్నా మెగా ఫ్యామీలి శ్రీరెడ్డి ఇష్యూతో కలిసిపోయారు.
మొన్న జరిగిన రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్ హజరై చరణ్‌కు సపోర్టు చేశాడు. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకుంటే ఉపాసనకు టిక్కెట్ ఇవ్వడానికి పవన్ నుంచి పెద్దగా విముఖత ఉండకపోవచ్చు.గెలిచే అవకాశాలున్న ప్రాంతాల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఓ ప్రాంతాన్ని ఉపాసనకు ఇవ్వలని జనసేన ఆలోచిస్తుందని సమాచారం. ఇది కనుక నిజం అయితే జనసేనలో కూడా కుటుంబ పాలన ఉంటుందని అందరు భావిస్తున్నారు.
