20 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కాబోతున్న బ్లాక్బస్టర్ సినిమా

- Advertisement -

ఒకప్పుడు ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఉపేంద్ర’ సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారింది. శాండల్ వుడ్ లోని కల్ట్ సినిమాలలో ఇది కూడా ఒకటి. అప్పట్లోనే ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే సినిమా విడుదలై ఇప్పటికి రెండు దశాబ్దాలు గడిచింది. మరి ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ సినిమా దర్శకనిర్మాతలు సినిమాని రెండవసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఉపేంద్ర’ సినిమా నిర్మాత శిల్పా శ్రీనివాస్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు.

సినిమా ని కొంచెం రీ మాస్టర్ చేసి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు శిల్పా శ్రీనివాస్. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రింట్ లను ఇంటర్నెట్ నుంచి త్వరగా డిలీట్ చేయాలని యాంటీ పైరసీ సెల్ మరియు సైబర్ క్రైమ్ బ్రాంచ్ వారిని ఆమె కోరుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఉపేంద్ర ని కలిసి సినిమా రిలీజ్ కు పర్మిషన్ కూడా తీసుకుంటామని ఆమె అన్నారు. సినిమా ఇప్పుడు కూడా హిట్ అవుతుందని, ప్రేక్షకులు సినిమాని తప్పకుండా థియేటర్లలో చూస్తారని ఆమె దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1999లో విడుదలైన ‘ఉపేంద్ర’ సినిమాలో ప్రేమ, రవీనాటాండన్ మరియు దామిని లు హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -