Saturday, May 4, 2024
- Advertisement -

‘సై రా’ విడుదల ఆపాలని మోర పెట్టుకుంటున్న నరసింహ రెడ్డి వారసులు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చుట్టూ విడుదలకు ముందే బోలెడు వివాదాలు చుట్టుకుంటున్నాయి. సినిమా విడుదలను ఆపాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఈ సినిమా విడుదల ఆపాలంటూ పోరాటానికి దిగారు. ఇంతకుముందే వారు చిరంజీవి ఇంటి ముందు ధర్నా కూడా చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక తాజాగా వారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పై సినిమా తీసేందుకు గాను నిర్మాత రామ్ చరణ్ తమకు గౌరవ వేతనం చెల్లిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని వారి ఆరోపణ. నరసింహారెడ్డి వారసులు 22 మంది ఉన్నారట. వారందరికీ కలిపి 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా రూ. 25వేలు మాత్రమే అందాయట. తర్వాత రామ్ చరణ్‌ను కలిసేందుకు వెళ్లగా పోలీసులను వెళ్లినా వాళ్ళు పట్టించుకోవడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -