Sunday, May 5, 2024
- Advertisement -

16 కోట్లతో ఫిదా తీస్తే.. ఇప్పటివరకు ఎంత వచ్చాయో తెలుసా..?

- Advertisement -

దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ఖుషీగా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఓ సినిమా ఫస్ట్ టైం రూ. 50 కోట్ల మార్కును దాటింది. శేఖర్ కమ్ముల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘ఫిదా’ నిలిచింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ ‘ఫిదా’. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య ప్రేమ నేపథ్యంలో సాగిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ 34.8 కోట్లు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘అనామిక’ లతో అనుకున్న రెంజ్ లో హిట్ కొట్టాలేకపోయిన శేఖర్ కమ్ముల ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘ఫిదా’ను తెరకెక్కించారు. పెద్ద కథ కాకపోయిన.. కమ్ముల టేకింగ్, భావేద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీనికి తోడు వరుణ్ తేజ్ ఇమేజ్, సాయి పల్లవి నటన సినిమా బాగా కలిసొచ్చాయి.

అమెరికాలో కూడా ‘ఫిదా’ పరుగులు తీస్తోంది. జులై 21న రిలీజ్ అయిన ఈ మూవీ 2 మిలియన్ డాలర్ల క్లబ్‌‌కు చేరువలో ఉంది. సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్‌తో దిల్ రాజు ఈ ఫిదాను నిర్మిస్తే.. 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా సినిమా రన్ లో ఉంది కాబట్టి.. ఇంకా కలెక్షన్స్ బారీగా వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -