Friday, March 29, 2024
- Advertisement -

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?

- Advertisement -

కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​ అన్ని రంగాలతోపాటూ సినీ రంగం మీద కూడా గట్టిగా పడింది. ఫస్ట్​వేవ్​, సెకండ్​వేవ్​ ఇలా రెండు సార్లు సినిమా ఇండస్ట్రీ దెబ్బతిన్నది. ఓ వైపు చిన్న సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నప్పటికీ.. పెద్ద సినిమాలకు మాత్రం చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్​డౌన్​ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎత్తేశారు. థియేటర్ల మీద ఎటువంటి ఆంక్షలూ లేవు. ఇక ఏపీలో మాత్రం కొన్ని ఆంక్షల నడుమ థియేటర్లు తెరుచుకొనేందుకు అనుమతులు వచ్చాయి. కానీ థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు పెద్ద నిర్మాతలు ముందుకు రావడం లేదు. అందుకు కారణం కరోనా భయమే. ప్రజల్లో ఇంకా పూర్తిస్థాయిలో కరోనా భయం పోలేదు. మరోవైపు జనాలు థియేటర్లకు వస్తారా? లేదా? అన్న ఆందోళన నెలకొన్నది.

కరోనా మొదటి వేవ్​ లాక్​డౌన్​ ఎత్తేశాక.. కొన్ని సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. అందులో క్రాక్​, వకీల్​సాబ్​ వంటి సినిమాలు ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలు సైతం బాగానే కలెక్షన్లు రాబట్టాయి. అయితే ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు ఎందుకో జంకుతున్నారు. ఏపీలో టికెట్ల రేటు విషయంలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో నిర్మాతలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు థియేటర్​లో సీటుకు సీటుకు మధ్య గ్యాప్​ ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి రూల్స్​ ఏమీ లేవు.

Also Read: అగ్ర హీరోలూ వెండితెరపై దర్శనమిస్తారా?

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?
ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటైన మాట వాస్తవమే కావచ్చు. చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతుండటంతో .. ఇక థియేటర్లకు ఎవరూ రారు అని కొందరు భావిస్తున్నారు. కానీ థియేటర్​లకు ఉండే క్రేజ్​ ఇంకా తగ్గలేదు. ఓటీటీ పట్ల ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. థియేటర్​లో ఆ కోలాహలంలో పెద్ద స్క్రీన్​మీద చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం కరోనా ఉంది. అంతేకాక థర్డ్​వేవ్​ వస్తుందంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కరోనాతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో థియేటర్​లో సినిమా విడుదలైతే ప్రేక్షకులు వస్తారా? అని చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

15 న విడుదలకు సిద్ధం..
ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ నెల 15న కొన్ని సినిమాలు థియేటర్​లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి వచ్చే కలెక్షన్లు, ప్రేక్షకాదరణను బట్టి మరికొన్ని చిత్రాలు విడుదల చేసే చాన్స్​ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సినీ పరిశ్రమ గడ్డు రోజులను గడుపుతోంది. బడా హీరోలు, ప్రొడ్యూసర్లకు పెద్దగా ఎఫెక్ట్​ తెలియకపోయినా.. సినిమా కోసం పనిచేసే చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -