Saturday, May 11, 2024
- Advertisement -

విన్నర్ మూవీ రివ్యూ!

- Advertisement -
Winner Movie in Telugu Review

వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అయితే తిక్క సినిమా ప్లాప్ కావడంతో క్రేజ్ కాస్తా తగ్గింది. దాంతో ఎలా అయిన ఈ సారి హిట్ కొట్టాలని విన్నర్ సినిమాతో వచ్చాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ లను తీసే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ విన్నర్ సినిమా.. సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి హిట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

వందల కోట్ల ఆస్తులకు వారసుడు మహేందర్ రెడ్డి (జగపతి బాబు). తను ప్రేమించిన అమ్మాయి కోసం అవన్ని కాదనుకొని తండ్రి (ముఖేష్ రుషి)ని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తర్వాత భార్య చనపోవడంతో కొడుకే ప్రపంచంగా బతుకుతుంటాడు. మహేందర్ రెడ్డి తండ్రికి వ్యాపరంలో భారీగా నష్టాలు వస్తాయి. బెట్టింగ్ వేసిన గుర్రాలు ఓడిపోతుండటంతో భారీ నష్టాలు మిగులుతాయి. బిజినెస్ లాభల్లోకి రావలంటే మహేందర్ రెడ్డి వస్తేనే బాగుంటుందని పార్టనర్స్ ఒత్తిడి చేస్తారు. కానీ మనవడిని మాత్రం తన కొడుకు నుంచి ఎలాగైన దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్టుగా తండ్రి కొడుకుల  మధ్య దూరం పెంచి సిద్ధార్థే, తండ్రి మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు. తండ్రి రేసుల కారణంగా తనకు దూరమయ్యాడన్న కోపంతో నాన్న అన్నా, గుర్రాలన్నా, రేసులన్నా ద్వేషం పెంచుకుంటాడు సిద్ధార్థ్. 20 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ ఓ పత్రికలో పనిచేస్తుంటాడు. సితారను ఒక పార్టీలో చూసి ప్రేమిస్తాడు. అదే సమయంలో సితారకు ఇష్టం లేని పెళ్ళి చేస్తాడు ఆమె తండ్రి. దాంతో సితార.. తాను సిద్ధార్థ్ ను ప్రేమించానని.. వీరు తీసుకువచ్చిన పెళ్లి కొడుకు తన ప్రియుడితో రేసులో గెలవాలని పందెం కాస్తుంది. మరి సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? సితారను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? సిద్ధార్ధ్, తిరిగి తండ్రి మహేందర్ రెడ్డి దగ్గరకు ఎలా చేరాడు..? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటి భాగం గురించి. ఫస్టాఫ్ నుంచే డైరెక్టర్ కథలోకి వెళ్లిపోవడం, ఆ కథ కాస్త కొత్తగా హార్స్ రేసులు నైపథ్యంలో సాగేదిగా ఉండటం ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు పద్మగా వెన్నెల కిశోర్ పాత్ర ద్వారా కామెడీ పండించారు. ఇక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ సింగం సుజాతగా పృథ్వి కామెడీ చాలా బాగుంది. ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్, పృథ్విల మధ్య సాగే కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ధరమ్ తేజ్ చెప్పిన కొన్ని పంచ్ డైలాగులు అభిమానులకు బాగా నచ్చుతాయి. కథలో ధరమ్ తేజ్, జగపతిబాబుల మధ్య నడిచిన సీన్స్ ఎమోషనల్ గా బాగా కుదిరాయి. జగపతిబాబు తన నటనతో మెప్పించగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందం ప్లస్ అభినయం తో ఆకట్టుకుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సెకండాఫ్ గురించి. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండాఫ్ లో మంచి కథ ఉంటుందని.. జగపతిబాబు పాత్ర చుట్టూ భీభత్సం జరుగుతుందని ఊహించేస్తారు ప్రతి ఒక్కరు. కానీ సెకండాఫ్ లో కథనం మరీ బలహీనంగా మారిపోయింది. సెకండాఫ్ లో ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటి లేకపోవడంతో అంతా కొట్టించింది. సినిమాకి ప్రధాన నైపథ్యం హార్స్ రేస్ కాబట్టి సినిమా చివర్లో హార్స్ రేస్ లాంటివి చాలా గొప్పగా ఉంటాయని ఊహిస్తే అవి కూడా చాలా సాదాసీదాగా ఉండి నిరుత్సాహపరిచాయి. మరో మైనస్ ఏంటంటే.. తేజ్ అద్భుతంగా డాన్స్ వేస్తారు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టెప్పులు స్క్రీన్ మీద చూపించలేకపోయారు. కొత్త బాడీ లాంగ్వేజ్ ట్రై చేద్దామని డ్యాన్సులను దూరం పెట్టిన తేజ్ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఇక అలీ కామెడీ కూడా రొటీన్ గానే ఉంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చిన పాటలు ఉత్సాహాన్ని కలిగించేలా లేవు. అలానే క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించేశారు. 

మొత్తంగా :

కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల తీసే గోపిచంద్ మలినేని కథ, ఫస్టాఫ్ లో వెన్నెల కిశోర్, పృథ్వి ల నవ్వించే కామెడీ, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, తండ్రి-కొడుకుల మధ్య నడిచే కొన్ని ఎమోషన్ సన్నివేశాలు, తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబుల నటన ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆకట్టుకొని కథనంతో నిండిన బోరింగ్ సెకండాఫ్, నిరుత్సాహపరిచే బలహీనమైన సన్నివేశాలు, అసంతృప్తిగా ముగిసిన క్లైమాక్స్, తేజ్ నుండి ఆశించిన స్థాయిలో డ్యాన్సులు లేకపోవడం మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘విన్నర్’ రొటీన్ కమర్షియల్ అంశాలతో తయారుచేయబడిన మూవీ.

{youtube}HloZM5VB2JY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -