- Advertisement -

సైబర్ క్రైంపై ఎన్టీఆర్‌, విజ‌య్‌, రాజ‌మౌళి షార్ట్‌ఫిల్మ్‌

- Advertisement -

తెలుగు తార‌ల‌తో తెలంగాణ పోలీసుల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

సైబ‌ర్ క్రైం నేప‌థ్యంలో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు తెలంగాణ ప్ర‌భుత్వం తీస్తోంది. తెలంగాణ పోలీసులు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌హాయంతో అవ‌గాహ‌న పెంపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం ద్వారా మోసం చేసే వారి సంఖ్యతోపాటు కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అలాంటి నేరాల‌ను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సైబ‌ర్ క్రైంపై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల‌ను రూపొందించారు. కొన్ని సెన్సార్ పూర్తి చేసుకున్నాయి కూడా. వీటిలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు కనిపించస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌, విజయ్ దేవరకొండ, ద‌ర్శ‌కుడు రాజమౌళి షార్ట్‌ఫిల్మ్‌ల‌లో మెర‌వ‌నున్నారు. ఇలా ప్ర‌ముఖుల‌తో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఈ విధంగా సైబ‌ర్ క్రైం నియంత్ర‌ణ‌పై తార‌లు అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. ఇక‌నైన ప్ర‌జ‌లు సైబ‌ర్ క్రైం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచిస్తోంది. గ‌తంలో కొన్ని అవ‌గాహ‌న షార్ట్ ఫిల్మ్స్‌లో రాజమౌళి కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్‌, అర్జున్ రెడ్డి ఫేం విజయ్‌దేవరకొండలతో కలిసి ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -