ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సమాచారం ప్రకారం, చిన్నారి స్కూల్‌కు వెళ్లే సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడికి ముందు చిన్నారి స్కూల్‌కు వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యాసిడ్ దాడి కారణంగా చిన్నారి శరీరంలోని కొన్ని భాగాలు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ భాగం కాలిపోవడంతో పరిస్థితి మరింత విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లి డిమాండ్ చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విజయవాడలో భయాందోళన నెలకొంది.
చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
