కామారెడ్డి జిల్లాలోని ఘనపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్విన్స్ డే సందర్భంగా కవలలను పెళ్లి చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందిన కవలల్లో ఒకరైన దుంపటి వినయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, వినయ్ కుమార్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉగాది సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన వినయ్, అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మానేరూ నదిలో, నర్మాల సమీపంలో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.ట్విన్స్ డే రోజున కవలలు కవలలను పెళ్లి చేసుకున్న ఘటన అప్పట్లో విశేషంగా చర్చనీయాంశమైంది. అలాంటి కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
