డాక్టర్ భార్య పై డాక్టర్ భర్త గృహ హింస..

- Advertisement -

మన దేశంలో మహిళా భద్రతపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన.. స్త్రీలపై హింస రోజు రోజుకి పెరుగుతునే ఉంది. అతడో డాక్టర్ మరో డాక్టర్​ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వైద్యులే కావడంతో కొంతకాలం కాపురం సజావుగానే సాగిందే. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. డాక్టర్​ శాడిస్టులా మారాడు. నిత్యం తన భార్యను ఏదో రకంగా వేధించసాగాడు. ఆమెను శారీరకంగా కూడా హింసించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై హైదరాబాద్​లోని కూకట్ పల్లి పీఎస్​లో కేసు నమోదైంది.

విజయవాడకు చెందిన నిర్మాణ రంగ వ్యాపారి( Prestige Construction) నాడకుడితి నారాయణ మూర్తి కుమారుడు డాక్టర్​ నవీన్​ కాంత్​కు .. ప్రియ అనే యువతితో వివాహమైంది. ఆమె కూడా డాక్టర్​గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది.

ఇటీవల నవీన్​కాంత్​ తరుచూ తన భార్య ప్రియను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కూకట్​పల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు డాక్టర్​ ఎన్​ నవీన్​ కాంత్​, ఆయన తండ్రి నారాయణ మూర్తి, బ్రమరంబా సుధ రాణి, ఎన్​ నళినీ కాంత్​ పై కేసు నమోదు చేశారు. ఐపీఎస్​ సెక్షన్​ 498 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Also Read

కళ్లముందే పులి ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపేసింది? అతను పరిస్థితి ఏంటంటే ..!

భారత్​లో తొలి కరోనా పేషెంట్​కు మళ్లీ పాజిటివ్​..!

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -