- Advertisement -

రౌడీషీటర్లకు డ్రగ్‌ టెస్టు..190 మందికి పాజిటివ్

- Advertisement -

హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేర కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రగ్ టెస్టులు నిర్వహించడం ప్రారంభించారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 1,300 మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. ఇటీవల వీరి కార్యకలాపాలు మరింత పెరగడంతో కట్టడి చర్యలు వేగవంతం చేశారు.

పోలీసులు ఇప్పటివరకు 250 మందికిపైగా రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు.ఈ పరీక్షల్లో సుమారు 190 మందికి గంజాయి వినియోగం ఉన్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.ఈ ఫలితాలు నగరంలో నేరాలకు డ్రగ్స్ ప్రభావం ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

డ్రగ్స్‌కు అలవాటు పడిన రౌడీషీటర్లు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్ టెస్టులను ఒక కీలక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.డ్రగ్ వినియోగం నిర్ధారణ అయిన వారికి కౌన్సెలింగ్, పర్యవేక్షణతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నగరంలో శాంతిభద్రతలు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.డ్రగ్స్ వినియోగం, రౌడీయిజం రెండింటినీ సమాంతరంగా అరికట్టే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ చర్యలతో నగరంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పెంచడం, నేరాలను తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -