- Advertisement -

ప్రేమజంట వాగ్వాదం.. ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయంలో ప్రేమజంట మధ్య జరిగిన వాగ్వాదం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. తన మాట నెగ్గలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జిల్లాలోని కురవి మండలానికి చెందిన వల్లపునేని శశికుమార్ (21) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కేసముద్రం సమీపంలోని ఒక తండాకు చెందిన ఇంటర్ చదువుతున్న యువతి (20)తో అతనికి గత ఒక సంవత్సరం నుంచి ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఇటీవల జరిగిన సంఘటన విషాదానికి దారితీసింది.

సమాచారం ప్రకారం శశికుమార్ తన ప్రియురాలికి ఫోన్ చేసి, ఇద్దరూ అదే రోజు పెళ్లి చేసుకుందామని పట్టుబట్టాడు. అయితే ప్రస్తుతం తనకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని యువతి చెప్పి అతన్ని సముదాయించేందుకు ప్రయత్నించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రియురాలు తన మాట వినలేదనే ఆవేదనతో శశికుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో కురవిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -