Saturday, May 4, 2024
- Advertisement -

బెంగాల్ లో బొగ్గు స్కాం లో కొత్త కోణం.. అదుపులో మరొక వ్యక్తి..?

- Advertisement -

తృణమూల్​ కాంగ్రెస్ యువ నేత​ వినయ్​ మిశ్రా సోదరుడు వికాస్​ మిశ్రాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు మంగళవారం అరెస్ట్​ చేశారు. రూ.1,300 కోట్ల పైగా అక్రమ బొగ్గు తవ్వకాల కేసులో మనీలాండరింగ్​ పాల్పడ్డారని వికాస్​పై ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు.
నిందితుడిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దిల్లీలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ముందు హజరుపరచగా… ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.

రూ.1300 కోట్లు విలువైన బొగ్గు అక్రమ మైనింగ్​ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరుపుతోంది. ఇప్పటికే బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్​ బెనర్జీ భార్య సహా మరో 39మందిని ప్రశ్నించింది.

సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ… పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కొంతమంది వ్యక్తుల అండతో మిశ్రా సోదరులు రూ.730 కోట్ల మేర లబ్ధిపొందారన్నది ఈడీ ఆరోపణ.

శాసనసభలో అదరగొట్టిన బాలరాజు.. ఏమన్నారు అంటే..!

విషాదంలో ఆ గ్రామం.. సెప్టిక్‌లో పడి ఐదుగురు దుర్మరణం!

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -