Thursday, April 25, 2024
- Advertisement -

న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!

- Advertisement -

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు బయట కొస్తున్నాయి. మృతుడు వామనరావు తండ్రి కిషన్​ రావు.. పెద్దపల్లి పోలీసులకు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో తమ కుమారు-కోడలిని హత్య చేశారని పోలీసులకు కిషన్ రావు తెలిపారు. హత్యకు ముందు పూదరి లచ్చయ్య అనే వ్యక్తి రెక్కీ నిర్వహించారని చెప్పారు. వారిని చంపేందుకు వచ్చిన కారును వదిలి నిందితులు మరో కారులో పరారయ్యారని వెల్లడించారు.

కాగా, వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు. వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశారు.

న్యాయవాద దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై వామన్​రావు తండ్రి కిషన్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని కూడా తప్పకుండా విచారించాలని పోలీసులను కోరారు. అయితే, వామనరావు తన చివరిక్షణాల్లో కుంట శ్రీను పేరు చెప్పడంతో అతడ్ని అరెస్ట్ చేస్తే దర్యాప్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కుంట శ్రీను మంథని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు.

ఏపీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట!

బెల్లంకొండ శ్రీనివాస్‌తో లైగర్ బ్యూటీ రోమాన్స్ !

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -