Tuesday, April 16, 2024
- Advertisement -

పోలీస్ ని చితక్కొట్టిన స్థానికులు.. వీడియో వైరల్

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ మొదలైనప్పటి నుంచి కేసుల సంఖ్య, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క నెలలోనే నాలుగు లక్షల కేసులు.. నాలుగు వేల మరణాలకు వెళ్లడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమల్లోకి తీసుకు వచ్చాయి. రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తమ అవసరాల కోసం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.. లాఠీ చార్జి చేస్తున్నారు.

తాజాగా లాక్‌డౌన్ వేళ ఇంట్లో నుంచి రోడ్డుపైకి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌ల‌పై ఓ పోలీసు లాఠీతో కొట్టాడు. దాంతో రెచ్చిపోయిన స్థానికులు ఆ పోలీసుని చితక్కొట్టారు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో చోటు చేసుకుంది.క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి కొంద‌రు చిరు వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. అలా కరోనా నిబంధనలు ఉల్లంఘించవొద్దని పోలీసులు వ్యాపారస్తులను హెచ్చరించారు.

అదే సమయంలో ఓ వ్యాపారిని ఓ పోలీసు లాఠీతో కొట్టాడు. అంతే అక్కడ స్థానికులకు కోపోద్రిక్తులయ్యారు.. పోలీసు వ‌ద్ద‌కు దూసుకెళ్లి, అసభ్య పదజాలంతో తిడుతూ, విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టి ఈడ్చుకెళ్లారు. అదే సమయానికి ఓ వ్యక్తి వచ్చి వారిని ఆపారు. జామ్‌తులి గ్రామంలో ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించడంతోనే తాము చ‌ర్య‌లు తీసుకు నేందుకు వెళ్లామ‌ని పోలీసులు చెబుతున్నారు. పోలీసును గ్రామ‌స్థులు కొట్టిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -