- Advertisement -

పడగ విప్పిన ర్యాగింగ్ భూతం..

- Advertisement -

వరంగల్‌లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

సమాచారం ప్రకారం, సీనియర్ విద్యార్థులు సుమారు 20 మంది జూనియర్లను “గోడ కుర్చీ” (wall sit) వేయించారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులు జరిగినట్లు తెలిసింది.జూనియర్లను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేలా ఈ ర్యాగింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనకు ముందు తృతీయ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆ గొడవను రాజీ ద్వారా పరిష్కరించినప్పటికీ, పరిస్థితి అక్కడితో ముగియలేదు.తరువాత రోజు జూనియర్లు తమ WhatsApp గ్రూపులో సీనియర్ల ప్రవర్తనపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

ఈ పోస్టులు చూసిన సీనియర్లు మరింత ఆగ్రహంతో జూనియర్లపై ర్యాగింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మార్చి 29న జరిగినప్పటికీ, ఇటీవలే బయటపడింది. కాలేజీ యాజమాన్యం దృష్టికి వచ్చిన వెంటనే విచారణ చేపట్టింది. ర్యాగింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించిన కళాశాల యాజమాన్యం, ఏడుగురు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది.

ఈ ఘటన మరోసారి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ సమస్య తీవ్రతను బయటపెట్టింది. విద్యార్థుల మధ్య చిన్న గొడవలు ఎలా పెద్ద సమస్యలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -