- Advertisement -

దారుణం..కట్టెల పొయ్యిలో పడేసి చిన్నారి హత్య!

- Advertisement -

హైదరాబాద్‌ నగర పరిధిలోని బౌరంపేటలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలల పసికందును కాళ్లు, చేతులు కట్టేసి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి కారణం పోస్ట్‌పార్టం సైకోసిస్‌ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల మమతను రాజేంద్ర ఆదివాసి ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి బౌరంపేటలో నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం మమతకు శిశువు జన్మించింది. అయితే శిశువు తరచుగా ఏడవడం వల్ల మమతకు సమయానికి నిద్ర, ఆహారం దొరకకుండా మానసిక ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమె పోస్ట్‌పార్టం సైకోసిస్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు.

ఘటన జరిగిన రోజు రాజేంద్ర కూలీ పనికి వెళ్లాడు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన మమత చిన్నారి కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రాజేంద్ర చిన్నారి కనిపించకపోవడంతో వెతకగా, పొయ్యిలో నుంచి బయటకు తీశాడు. అప్పటికే శరీరం సగం కాలిపోయి చిన్నారి మృతి చెందినట్లు గుర్తించాడు.

భార్యను నిలదీయగా మమత ఆగ్రహంగా ప్రవర్తించిందని సమాచారం. వెంటనే రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మమతను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం కూడా మమత అసహజంగా ప్రవర్తిస్తూ, పోలీసులపై అరుస్తూ ఊగిపోయినట్లు తెలుస్తోంది. పోస్ట్‌పార్టం సైకోసిస్‌ నేపథ్యంలో ఆమె మానసిక పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -